TDP Leader: చంద్రబాబు,లోకేష్‌లను విమర్శించే స్థాయి ఎంపీ భరత్‌కు లేదు

ABN , First Publish Date - 2022-09-02T20:22:22+05:30 IST

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ (Margani bharath) అవినీతిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు (Adireddy Apparao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

TDP Leader: చంద్రబాబు,లోకేష్‌లను విమర్శించే స్థాయి ఎంపీ భరత్‌కు లేదు

రాజమండ్రి: వైసీపీ ఎంపీ మార్గాని భరత్ (Margani bharath) అవినీతిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు (Adireddy Apparao) సంచలన వ్యాఖ్యలు  చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief chandrababu), లోకేష్‌ (Lokesh)లను విమర్శించేంత స్థాయి ఎంపీ భరత్‌ (MP Bharath)కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం ఎంపీగా ఎమ్మెల్యేగా గెలవలేని ఎంపీ భరత్ తనపై లోకేష్ (TDP Leader) పోటీ చేయాలని సవాల్ విసరటం హాస్యాస్పదమని వ్యాఖ్యలు చేశారు. ఎంపీ భరత్‌ (YCP MP)కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబంపై పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.


ఎంపీ మార్గాని భరత్ (MP Margani bharath) లాంటి అవినీతి ఎంపిని ఎక్కడా చూడలేదన్నారు. ఆవ భూముల్లో 586 ఎకరాల్లో అవకతవకలకు పాల్పడిన వ్యక్తుల్లో ఎంపీ ఒకరని ఆరోపించారు. సీబీఐ విచారణ నుంచి ఎంపీ తప్పించుకోలేరని తెలిపారు. త్వరలో ఉచలు లెక్క పెట్టాలని హెచ్చరించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజక వర్గాల్లో ఐదు నియోజక వర్గాలను మర్చిపోయిన వ్యక్తి భరత్ అని మండిపడ్డారు. త్వరలో ఎంపీ మార్గాని భరత్ అవినీతి బయట పడుతుందన్నారు. ఎంపీ అవినీతిపై ఆధారాలు బయటపెడతానని ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. 

Updated Date - 2022-09-02T20:22:22+05:30 IST