ఎంపీ భరత్‌లా దిగుజారుడు రాజకీయాలు చేతకాదు

ABN , First Publish Date - 2022-07-01T06:22:22+05:30 IST

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌లా దిగజారుడు రాజకీయాలు తాము చేయమని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు అన్నారు.

ఎంపీ భరత్‌లా దిగుజారుడు రాజకీయాలు చేతకాదు
విలేకరులతో మాట్లాడుతున్న ఆదిరెడ్డి వాసు

 టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు


రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 30: రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌లా  దిగజారుడు రాజకీయాలు తాము చేయమని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎంపీ భరత్‌ రామ్‌కు కనీసం పెద్దలంటే గౌరవం లేదన్నారు. తన తండ్రి అప్పారావును చాలా చులకనగా భరత్‌ మాట్లాడడం అతని కుసంస్కారానికి అద్దంపడుతుందన్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశంలో వారి పార్టీ కోసం మాట్లాడుకోవాలని, సమావేశం అంతా తన కుటుంబం పైనే బురద జల్లుతూ ఆదిరెడ్డి నామస్మరణ చేయడం చూస్తే రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డిని ఎదుర్కోవడానికి ఎంపీ భయపడుతున్నట్టుగా అర్ధమౌవుతుందన్నారు. నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు షేక్‌ సుభాన్‌, కుడిపూడి సత్తిబాబు,  ఈతలపాటి కృష్ణ, మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్‌, బంగారు నాగేశ్వరరావు, యాళ్ళ ప్రదీప్‌, బొర్రా చిన్ని, కడలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T06:22:22+05:30 IST