Vangalapudi Anitha comments: మాధవ్‌ను మహిళా మంత్రులు వెనకేసుకు రావడం సిగ్గుచేటు: అనిత
ABN , First Publish Date - 2022-08-13T19:25:27+05:30 IST
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla madhav) వ్యవహారాన్ని మహిళా మంత్రులు కూడా వెనకేసుకు రావడం సిగ్గుచేటని టీడీపీ నేత వంగలపూడి అనిత(Vangalapudi anitha) విమర్శలు గుప్పించారు.
అమరావతి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla madhav) వ్యవహారాన్ని మహిళా మంత్రులు కూడా వెనకేసుకు రావడం సిగ్గుచేటని టీడీపీ నేత వంగలపూడి అనిత(Vangalapudi anitha) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గోరంట్ల (YCP MP) విషయంలో ఎస్పీ ఫకీరప్ప (SP Fakirappa) క్లీన్చిట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ వీడియో లేదని మాత్రమే అన్నారని తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికితే విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారని అన్నారు. అమెరికా ఫోరెన్సిక్ (America Forensic) నివేదిక ఆధారంగా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ రిపోర్ట్‌పై కూడా ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా మాధవ్ హోర్డింగ్‌లు పెట్టించుకున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.