Atchannaidu: ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు...

ABN , First Publish Date - 2022-09-27T19:15:17+05:30 IST

ఉత్తరాంధ్ర మంత్రులు దద్ద్మలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

Atchannaidu: ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు...

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర మంత్రులు దద్ద్మలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రైతుల పాదయాత్రను అడ్డుకోవటానికి 5 నిమిషాలు చాలు అని మంత్రి బొత్స(Botsa satyanarayana) అంటున్నారని... రాష్ట్రం బొత్స(AP Minister) జాగీరు కాదని అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అమరావతి రైతులు పాదయాత్ర (Maha padayatra) చేస్తుంటే కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దా అని ప్రశ్నిస్తున్నారన్నారు.


‘‘దద్దమ్మల్లారా అభివృద్ధి చేస్తే ఎవరు వద్దంటున్నారు...?. అచ్చన్నాయిడు వద్దంటున్నాడా..? చంద్రబాబు (Chandrababu naidu) వద్దన్నాడా..?. ఉత్తరాంధ్రాను అభివృద్ధి చేస్తామంటే ఉత్తరాంధ్ర ప్రజలు వద్దంటున్నారా..?. ప్రజలను మభ్యపెట్టడానికే మూడు రాజధానులు డ్రామాలు. ఈ మూడు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు ఏమి చేశారు?. మీరు చేయకపోగా, ఉన్న అభివృద్ధిని పాతాళంలోకి తొక్కేశారు. ఉత్తరాంధ్రపై ప్రేమతో మీరు మాట్లాడడంలేదు. కేవలం ఉత్తరాంధ్ర భూములను కొట్టేయడానికే మీ  కపట ప్రేమ. చివరికి ప్రకృతి ఇచ్చిన రుషి కొండను కూడా కాజేస్తున్నారు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. పాదయాత్రకు ఆటంకం కలిగించాలని మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా నాడు జగన్ (YS jagana mohan reddy) అమరావతి రాజధానికి అంగీకరించారని అచ్చెన్నాయుడు (TDP Leader) గుర్తు చేశారు. 

Updated Date - 2022-09-27T19:15:17+05:30 IST