TDP Leader: జగన్ ఏపీని పాలించే హక్కు కోల్పోయారన్న బచ్చుల అర్జునుడు

ABN , First Publish Date - 2022-08-22T18:22:26+05:30 IST

గన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు కోల్పోయారని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు అన్నారు.

TDP Leader: జగన్ ఏపీని పాలించే హక్కు కోల్పోయారన్న బచ్చుల అర్జునుడు

అమరావతి: సీఎంగా జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఆంధ్ర రాష్ట్రాన్ని(Andhrapradesh) పరిపాలించే హక్కు కోల్పోయారని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు (Bachula arjunudu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు (Chandrababu naidu) హయాంలో కేటాయించిన ఇంటికి కూడా ప్రభుత్వానికి పన్ను కడుతూ ఉంటే ఇప్పుడు ఈ జగన్ రెడ్డి (CM Jagan) ప్రభుత్వం ప్రభుత్వ స్థలం ఆక్రమించాడని కూలగొట్టడానికి అర్ధరాత్రి వెళ్లడం దొంగల పని అని మండిపడ్డారు. నిజంగా ఆక్రమిస్తే ప్రభుత్వం వారు కొలతలు కొలిచి, నోటీసులు ఇచ్చి తదుపరి కార్యాచరణ చేయాలి కానీ అది చేయకుండా కక్షపూరితంగా చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. గత మునిసిపల్ ఎన్నికలలో వైసీపీ (YCP) కౌన్సిలర్‌ను ఓడించి టీడీపీ కౌన్సిలర్‌గా టీడీపీ తరఫున గెలిచాడన్న అక్కసుతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి తమ యువ నాయకుడు లోకేష్ వెళితే అడ్డుకుంటారా అని అన్నారు. ఇదే విధానం టీడీపీ హయాంలో అనుసరించి ఉంటే జగన్ రెడ్డి అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసేవారా అని బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-22T18:22:26+05:30 IST