
విజయవాడ: ఎన్నికల సమయంలో ముస్లింలకు పెద్దపీఠం వేస్తామని జగన్మోహన్ రెడ్డి(Jagan mohan reddy) అనేక వాగ్దానాలు చేశారని... అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను వదిలి పారేశారని టీడీపీ నేత బోండా ఉమా(Bonda uma) అన్నారు. దులహన్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ముస్లిం సంఘాల నాయకులు ధర్నాలో బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు అధికారంలో ఉండగా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు అనేక లోన్లే ఇప్పించి వాళ్ళ అభివృద్ధికి టీడీపీ ఎంతో సహకరించిందని గుర్తుచేశారు. మైనార్టీ సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, అయితే మైనారిటీ కార్పొరేషన్‌కు వైసీపీ నిధులు కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో మైనార్టీలను వాడుకొని వదిలేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. మైనార్టీలను జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గతంలో ఏ విధంగా ముస్లింలకు పెద్దపీట వేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి