
విజయవాడ: మాజీ మంత్రి నారాయణ(Narayana)అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్దా వెంకన్న(Budda venkanna) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నారాయణ అరెస్టు వెనుక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. మొన్న ఉపాధ్యాయుల ఆందోళనలో జగన్ తీరుపై టీచర్లు ధ్వజమెత్తారని... అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) వారిపై కక్ష కట్టారన్నారు. పదో తరగతి పేపర్‌ను ప్రభుత్వ పెద్దలే లీక్ చేశారని అన్నారు. ఇప్పుడు కొంతమంది టీచర్‌లను టార్గెట్ చేసి కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. నారాయణను కూడా ఈ కేసులో ఇరికించారన్నారు. ప్రభుత్వంపై పడిన మచ్చను చెరిపేయాలని మాజీ మంత్రిగా నారాయణను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు భయపడవద్దని.. తాడోపేడో తేల్చుకుందామని తెలిపారు. నారాయణ అక్రమ అరెస్ట్‌పై పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని టీపీపీ శ్రేణులకు బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి