పిచ్చికుక్కను అందలమెక్కించి చంద్రబాబు తప్పు చేశారు: బుద్దా వెంకన్న

Published: Wed, 16 Mar 2022 12:11:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పిచ్చికుక్కను అందలమెక్కించి చంద్రబాబు తప్పు చేశారు: బుద్దా వెంకన్న

విజయవాడ: మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని ఓ పిచ్చి కుక్క అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సాయాన్ని కూడా తప్పు పట్టడానికి నానికి సిగ్గుండాలని అన్నారు. మంత్రి పదవి పోతుందనే భయంతోనే  మంత్రి వ్యాఖ్యలు చేశారన్నారు. పిచ్చి కుక్కను అందలం ఎక్కించి నాడు చంద్రబాబు తప్పు చేశారని...  చంద్రబాబు దగ్గర కొడాలి నాని బీఫాం తీసుకుని గెలవలేదా? అని ప్రశ్నించారు. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా కొడాలి నానికి లేదన్నారు. చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చే మనిషి కాదు.. పవన్ తీసుకునే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. డేరా బాబా తరహాలో కొడాలి నాని జైలుకెళ్లడం ఖాయమన్నారు. 10 రోజుల్లో కొడాలి నాని అవినీతి చరిత్ర బయటపెడతా అని బుద్దా వెంకన్న హెచ్చరించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.