
అమరావతి: అమరావతి రైతుల కష్టాన్ని, త్యాగాన్ని వైసీపీ పాలకులు గుర్తించకపోయినా.. ఆ దేవుడు గుర్తించాడని... అందుకే హైకోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయమని తెలిపారు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వైసీపీ నేతలు భేషజాలకు పోకుండా ఇకనైనా మూడు రాజధానులు విషయం మర్చిపోయి.. అమరావతి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే రాష్ట్రానికి దేశానికి మంచిదని దేవతోటి నాగరాజు హితవుపలికారు.
ఇవి కూడా చదవండి