జగన్ సీఎంగా తీసుకునే ప్రతీ నిర్ణయం నేరపూరితమే: Devthoti

Published: Sat, 26 Mar 2022 10:45:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జగన్ సీఎంగా తీసుకునే ప్రతీ నిర్ణయం నేరపూరితమే: Devthoti

అమరావతి: ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఓపెన్ కేటగిరీలో పెట్టడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... స్వతహాగా నేర స్వభావం ఉన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకునే ప్రతీ నిర్ణయం నేరపూరితంగానే ఉంటోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల అవకాశాలను, హక్కులను, ఆత్మగౌరవాన్ని కాలరాయడంలో వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి మొండిగా ముందుకు వెళ్తూనే ఉందని మండిపడ్డారు. 27 దళిత సంక్షేమ స్కీమ్‌లను రద్దు చేసి దళితులకు అన్యాయం చేశారన్నారు. దళితులకు జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని దళిత యువత, మేధావులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాలని దేవతోటి నాగరాజు పిలుపునిచ్చారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.