
అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ప్రజలపై పన్నుల భారం విధించడంపై జగర్ సర్కార్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదకగా స్పందిస్తూ...‘‘పెట్రోల్, డీజిల్ ధరల్లో దక్షిణాదిలో ఏపీ నెంబర్ వన్, దేశంలో మూడోస్థానం. అదనపువ్యాట్, రోడ్లపన్నులంటూ భారీగావడ్డింపు, సీఎన్‌జీని వదలనివైనం. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న ఏపీని నేడు అప్పులు తేవడం, పన్నులు వేయడంలో అగ్రగామిగా నిలిపి దేశం మొత్తం మనవైపు చూసేలా చేసిన మాట వాస్తవం కాదా?సీఎం జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.