కరోనా ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?: దేవినేని

ABN , First Publish Date - 2020-12-02T17:04:37+05:30 IST

కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు, వాటి బిల్లులపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కరోనా ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?: దేవినేని

అమరావతి: కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు, వాటి బిల్లులపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోవిడ్ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదిగా దేవినేని స్పందిస్తూ...‘‘కోవిడ్ కోసం 900 కోట్లు ఖర్చుచేసినట్టు లెక్కలు, 400కోట్ల పెండింగ్ బిల్లులు, కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? మెరుగైన వైద్య సేవల కోసం ఎన్‌ఎచ్‌ఎం ఇచ్చిన 600కోట్లు, మ్యాచింగ్ గ్రాంట్ 400కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? నిధుల మళ్లింపు నిజం కాదా?’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-12-02T17:04:37+05:30 IST