
రాజమండ్రి: పోలవరం నిర్వాసితుల కోసం అవసరమైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తాను వెళతానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. నగరంలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితులు సమస్యలతో గగ్గోలుపెడుతుంటే జగన్ రెడ్డి తాడేవల్లి ప్యాలెస్లో పబ్జీ ఆడుకుంటున్నాడని విమర్శించారు. సాక్షి గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి 2013 భూసేకరణ చట్టం చదివి వాస్తవాలు మాట్లాడాలన్నారు. పోలవరం నిర్వాసితులకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులను చంద్రబాబునాయుడు వద్దకు తీసుకువెళతామన్నారు.
పోలవరం నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితుల కోసం అవసరమైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళతానన్నారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు 2013 భూసేకరణ చట్టం చదువుకొని నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్వాసితులు 22 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గమన్నారు. నిర్వాసితుల త్యాగం వల్లే పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి