Former minister: జి.కొండూరులో దేవినేని ఉమా నిరసన దీక్ష

ABN , First Publish Date - 2022-10-01T19:53:15+05:30 IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ జి. కొండూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసన దీక్ష చేపట్టారు.

Former minister: జి.కొండూరులో దేవినేని ఉమా నిరసన దీక్ష

ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health university) పేరు మార్పును వ్యతిరేకిస్తూ జి. కొండూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni uma) నిరసన దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరును ప్రభుత్వం కుట్ర పూరితంగా మార్చిందంటూ టీడీపీ శ్రేణులు (TDP) నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిక్షణం ప్రజలతో ఉన్న పార్టీ 40 సంవత్సరాలు ప్రజలతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం రిజర్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ (NTR) అని... పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని ఎన్టీఆర్ అసెంబ్లీలో బిల్లు పెట్టీ ఆమోదిస్తే అది పార్లమెంటులో బిల్లు పెట్టి యాక్ట్ చెయ్యడానికి 20 సంవత్సరాలు పట్టిందని అన్నారు. టీడీపీ (TDP)ని ప్రజలు ఓడించలేరని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి (AP CM) పోలవరం పునాదులు లేవలేదని అబద్ధాలు చెప్పి నిర్వాసితులకు హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు కసిగా పని చేయాల్సిన అవసరం ఉందని దేవినేని ఉమా పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-10-01T19:53:15+05:30 IST