Advertisement

చైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు: ఏసీబీ

Apr 23 2021 @ 20:05PM

విజయవాడ: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ ప్రకటన విడుదల చేసింది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో అనేక ఆర్థిక, పాలనా పరమైన అవకతవకలు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఇతరుల సహకారంతో చైర్మన్‌ నరేంద్ర అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ తెలిపింది. తీవ్రమైన నేరం కావడం, ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభించాయని ఏసీబీ వెల్లడించింది. చైర్మన్‌గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారని ఏసీబీ స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని, ఈ కేసులో డెయిరీ చైర్మన్‌ నరేంద్రకుమార్‌ ఏ1, ఏ2 డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, ఏ3గా ఎం. గురునాథం ఉన్నారని ఏసీబీ వెల్లడించింది.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.