Jawahar comments: ఉద్యోగులకు హక్కులుంటాయని జగన్ తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-29T15:00:09+05:30 IST

ఉద్యోగులకు బాధ్యతతో పాటు హక్కులుంటాయని జగన్ తెలుసుకోవాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు.

Jawahar comments: ఉద్యోగులకు హక్కులుంటాయని జగన్ తెలుసుకోవాలి

అమరావతి: ఉద్యోగులకు బాధ్యతతో పాటు హక్కులుంటాయని జగన్ తెలుసుకోవాలని మాజీ మంత్రి జవహర్ (Jawahar) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన మాట తప్పటం జగన్‌ (CM Jagan)కు అలవాటైందని విమర్శించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి (Jaganmohan reddy) మూడేళ్ళ తరువాత అసాధ్యమని ఎలా చెపుతారని ప్రశ్నించారు. నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అణచలేరన్నారు. ఉద్యోగ వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వాన్ని(Jagan government) నడుపుతున్నారని మండిపడ్డారు. పీఆర్సీ 
(PRC) ఎండమావిలాగా మారిందని, డీఏ (DA)ల ఊసేలేదన్నారు. జగన్ (Jagan) ఉద్యోగ సంఘాలను బెదిరించటం సరికాదని అన్నారు. ఉద్యోగులకు పోరాటమే శరణ్యమని జవహర్పే (TDP Leader)ర్కొన్నారు. 

Updated Date - 2022-08-29T15:00:09+05:30 IST