తక్షణమే పయ్యావులకు గన్‌మెన్లను కేటాయించాలి: Lokesh

ABN , First Publish Date - 2022-07-11T18:21:36+05:30 IST

టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు భద్రతను తొలగించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే పయ్యావులకు గన్‌మెన్లను కేటాయించాలి: Lokesh

అమరావతి: టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌(Payyavula keshav)కు భద్రతను తొలగించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ(YCP) డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టుర‌ట్టు చేశార‌నే అక్క‌సుతో ప‌య్యావుల కేశ‌వ్ సెక్యూరిటీ తొల‌గించేశారని మండిపడ్డారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌రెడ్డి(Jagan reddy) ఆర్థిక ఉగ్ర‌వాదాన్ని గ‌ణాంకాలతో స‌హా వెల్ల‌డించిన కేశ‌వ్‌ త‌న‌కు అద‌న‌పు భ‌ద్ర‌త కావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరితే.. ఉన్న సెక్యూరిటీ తొల‌గించేశారన్నారు. ఈ క‌క్ష‌సాధింపుల‌తో వైసీపీ స‌ర్కారు వేల‌కోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజ‌మేన‌ని ఒప్పుకున్న‌ట్టే అని అన్నారు. త‌క్ష‌ణ‌మే కేశ‌వ్‌ అద‌న‌పు గ‌న్‌మెన్ల‌ను కేటాయించి సెక్యూరిటీ పున‌రుద్ధ‌రించాలని లోకేష్ డిమాండ్ చేశారు. 


మరోవైపు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ప్రకటించడంపైనా లోకేష్ విమర్శలు గుప్పించారు. ‘‘ఉత్త‌ర‌కొరియా నియంత‌ కిమ్‌ని మించిపోయాడు జ‌గ‌న్. పార్టీకి శాశ్వ‌త అధ్య‌క్షుడిగా త‌న‌కి తానే ప్ర‌క‌టించుకున్నాన‌ని, రాష్ట్రానికి శాశ్వ‌త ముఖ్య‌మంత్రిని అనుకుంటున్నారేమో!’’ లోకేష్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-07-11T18:21:36+05:30 IST