Andhra news: దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా?: లోకేష్

ABN , First Publish Date - 2022-07-20T16:28:08+05:30 IST

రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు.

Andhra news: దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా?: లోకేష్

అమరావతి: రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో జగన్ రెడ్డి(Jagan reddy) దొంగ బ్రతుకు మరోసారి బయటపడిందన్నారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను గృహ నిర్భంధం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని టీడీపీ నాయకులు పట్టుకుంటే వారిని వదిలేసి టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చెయ్యడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి నిదర్శనమని మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగే అంటారు తప్ప నాయకుడు అనరన్నారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ నాయకుల(YCP leaders)పై చర్యలు తీసుకోవాలని అన్నారు. అరెస్ట్ చేసిన టీడీపీ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-20T16:28:08+05:30 IST