ఎంతమంది చనిపోతే స్పందిస్తారు: Lokesh

ABN , First Publish Date - 2022-03-16T19:42:07+05:30 IST

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ప్రోత్సాహం తో నాటుసారా తయారవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపణలు గుప్పించారు.

ఎంతమంది చనిపోతే స్పందిస్తారు: Lokesh

అమరావతి: రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ప్రోత్సాహం తో నాటుసారా తయారవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. జంగారెడ్డిగూడెం ఘటనపై బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని.. జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై సభాహక్కుల నోటీస్ ఇచ్చామని... సీఎం ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. మంత్రి కొందరు కల్తీ సారా తాగి చనిపోయారని అంటున్నారని... ముఖ్యమంత్రి సహజ మరణాలు అంటున్నారని... ఇందులో ఏది నిజం అని నిలదీశారు. సహజ మరణాలు అయితే ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారని టీడీపీ నేత ఆగ్రహించారు. ఎల్జీ పాలిమర్స్ మృతులకు కోటి ఇచ్చారు.. ఇప్పుడు కనీసం సీఎం పరామర్శించలేదని విమర్శించారు. ఎంతమంది చనిపోతే స్పందిస్తారని ప్రశ్నించారు. ‘‘మేము సీరియస్ గా ఆందోళన చేస్తుంటే.. మంత్రులు సభలో జోకులు వేసుకుని నవ్వుతున్నారు’’ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-03-16T19:42:07+05:30 IST