అట్టహాసంగా లోకేష్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-01-24T04:56:21+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షబాబు జన్మదినం వేడుకలు శనివారం నెల్లూరు నగరంలో వాడవాడలా జరిగాయి.

అట్టహాసంగా లోకేష్‌ జన్మదిన వేడుకలు
టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నేతలు అజీజ్‌, కోటంరెడ్డి, తదితరులు

 కేక్‌ కట్‌ చేసిన టీడీపీ నాయకులు

నెల్లూరు (వ్యవసాయం), జనవరి 23 : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షబాబు జన్మదినం వేడుకలు శనివారం నెల్లూరు నగరంలో వాడవాడలా జరిగాయి. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత నెల్లూరు పార్లమెంటు కోఆర్డినేటర్‌ కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు.  తండ్రికి తగ్గ తనయుడు లోకే్‌షబాబు అని భవిష్యత్తు నిర్ధేశించే నాయకుడవుతాడని కొనియాడారు. టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం దళితవాడల నుంచే ప్రారంభం అయ్యేలా నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి లోకే్‌షబాబని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ధర్మవరపు సుబ్బారావు, జెన్ని రమణయ్య, రంగారావు, ఖాజావలి, జలదంకి సుధాకర్‌, సాబీర్‌ఖాన్‌, నెల్లూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, రేవతి, విజయలక్ష్మి, మామిడాల మధు, పొత్తూరు శైలజ, పెంచలయ్య పాల్గొన్నారు. పార్టీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో పలుచోట్ల లోకే్‌షబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. నవాబుపేట శివాలయం, సంతపేటలోని అభయాంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కప్పిర శ్రీనివాసులు, రేవతి తదితరులు పాల్గొన్నారు. నారాలోకేష్‌ సేవాసమితి ఆధ్వర్యంలో గీతామయి వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సుబ్బారావు, మల్లికార్జురెడ్డి, మామిడాల మధు, ఉచ్చి భువనేశ్వరప్రసాద్‌, పొత్తూరు శైలజ తదితరులు పాల్గొన్నారు. నగర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సాబీర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. గాంధీనగర్‌లోని వినాయకుడి గుడి, సాల్వేషన్‌ ఆర్మీ చర్చ్‌, బారాషాహిద్‌ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు మన్నెం పెంచలనాయుడు, జలదంకి సుధాకర్‌, మాతంగి కృష్ణ, చెంచయ్య, గంగాధర్‌, అస్లాం,శాంతినాయుడు, చంద్రనాగ్‌ రమేష్‌ నాయుడు, విజయ్‌, దయాకర్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 47వ డివిజన్‌ గుప్తాపార్కు సెంటర్‌లో మాజీ కార్పొరేటర్‌ ధర్మవరం సుజాతరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో  ధర్మవరం సుబ్బారావు, వాణి, గిరి, కోటపాటి రాజ, రామిశెట్టి గిరి, మైలాపూర్‌ పెంచలయ్య, అద్దంకి చంద్ర, తురకా ఏడుకొండలు పాల్గొన్నారు. టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో శివాలయం ముందు నూటొక్క టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్‌కుమార్‌రెడ్డి, సుకే్‌షవర్ధన్‌ రెడ్డి, మామిడాల మధు, రాకే్‌షరెడ్డి, నాసిర్‌, వంశి, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-01-24T04:56:21+05:30 IST