వైసీపీ పాలనలో గిరిజనులకు అన్యాయం

ABN , First Publish Date - 2022-08-10T04:07:50+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులు అడుగడుగునా అన్యాయాలకు గురయ్యారని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో గిరిజనులకు అన్యాయం
మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు

ఆదివాసి దినోత్సవంలో మాలేపాటి

కావలి, ఆగస్టు 9: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులు అడుగడుగునా అన్యాయాలకు గురయ్యారని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక షాదీమంజిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎరుకల, గిరిజన సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి కల్లయ్య అధ్యక్షతన ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాలేపాటి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి గిరిజనులపై దాడులు జరిగాయన్నారు. తమ బతుకులు మారుతాయనే ఆశతో గిరిజనులు వైసీపీకి ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారన్నారు. జగన్‌ వారికి న్యాయం చేయకపోగా గిరిజనుల నిధులు దారి మళ్లించి నవరత్నాల పేరుతో నిలువునా మోసం చేశారన్నారు. గిరిజన నాయకుడు కల్లయ్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే గిరిజనులకు మేలు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనసంఘ  నాయకులు బోగిరి ప్రభాకర్‌, పేరం రవిబాబు, కత్తి ఆదిశేషయ్య, పోలా వెంకటరమణ, మొగిలి విజయకుమార్‌, కే. నరసింహారావు, రాధమ్మ, నరసింహులు, ఝాన్సీరాణి, వసంతమ్మ, చలంచర్ల రాజా, పోట్లూరి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్‌, జ్యోతిబాబూరావు, ఏగూరి చంద్రశేఖర్‌, షేక్‌ మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:07:50+05:30 IST