Guntur: నక్కా ఆనంద బాబును అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-06-04T15:27:13+05:30 IST

టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నరసరావుపేటకు బయలుదేరిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు అడ్డుకున్నారు.

Guntur: నక్కా ఆనంద బాబును అడ్డుకున్న పోలీసులు

గుంటూరు:  టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నరసరావుపేటకు బయలుదేరిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు(Nakka Anand babu)ను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి ముందే మాజీ మంత్రిని పోలీసులు అడ్డగించారు. కాగా పోలీసుల తీరుపై ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏ కారణం తో నన్ను ఆపుతున్నారో సమాధానం చెప్పాలి. పోలీసులకు ప్రతి రోజు ఓ ఆట అయిపోయుంది. అక్రమంగా నన్ను నిర్బంధిస్తే కోర్టులో పిటిషన్ వేస్తా, వైసీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు ఆడితే ఇబ్బందులు పడతారు. పట్టపగలే హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేయడం లేదు. పరామర్శలకు వెళ్లే తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం’’ అంటూ నక్కా ఆనంద బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-06-04T15:27:13+05:30 IST