అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి: నక్కా ఆనంద్

Sep 21 2021 @ 11:56AM

గుంటూరు: చంద్రబాబు ఇంటిపై జరిగింది దాడి కాదని చిత్రీకరించడానికి ముగ్గురు ఐపీఎస్‌లు తాపత్రయం చెందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ నేరుగా ఇది ఆరంభం మాత్రమే అని ప్రకటన చేశారని... కానీ గుంటూరు డిఐజీ , ఎస్పీలు నిస్సీగ్గుగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలీసు, ఐపీఎస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా కొంత మంది పని చేస్తున్నారని తెలిపారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తాము కూడా అధికారం చేపట్టామని... ఏ రోజు పోలీసు వ్యవస్థను ఇంత నీచంగా వాడుకోలేదన్నారు.


డీజీపీ ఆఫీస్ దగ్గర ఓ ఏఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టారని...అయితే తమను అడ్డుకుంది ఎస్పీ అమ్మిరెడ్డి అని.... ఏఎస్ఐ కాదని ఆయన స్పష్టం చేశారు. ఓ ఐపీఎస్ రెడ్డి, ఓ వైసీపీ రెడ్డిని సాదరంగా లోపలకు పంపించారని తెలిపారు. వైసీపీ నేతలకు ఎస్పీ అమ్మి రెడ్డి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారన్నారు. బాధితులు తమ గోడు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు. వాపు చూసి వైసీపీ బలుపు అని సంబర పడుతుందన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకోని పోలీసులు పని చేయాలని హితవుపలికారు. జగన్ పాలనలో రాజ్యాంగాన్ని రోజు రోజుకు తూట్లు పొడుస్తున్నారని నక్కా ఆనంద బాబు వ్యాఖ్యానించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.