వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ లోకేష్

ABN , First Publish Date - 2020-10-26T19:07:39+05:30 IST

వైసీపీ నేతలపై టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ లోకేష్

అమరావతి: వైసీపీ నేతలపై టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ తోడు దొంగలు తనను తిరగకుండా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వారు తిరిగితే తాము ఎందుకు వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతామని ప్రశ్నించారు. కొల్లేరుకు ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయని... వారిని ఆదుకునే చర్యలు లేవని విమర్శించారు. పంటలు మునిగిపోయాయని... గిట్టుబాటు ధర లేదని లోకేష్ అన్నారు. రైతు భరోసా అంటూ దానిలోను కోత పెట్టారని వ్యాఖ్యానించారు.  ఒక మంత్రి బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడన్నారు. తాము తిరుగుతున్నామని ఆగమేఘాల మీద నిధులు విడుదల చేస్తున్నారని...  అవి అరకొరగానే అని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని.. రంగులు వేయడానికి డబ్బులు ఉంటాయి గానీ,  రైతులను ఆదుకోవడానికి డబ్బులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలని... ఉభయగోదావరి,  కృష్ణా జిల్లా రైతులకు సూచిస్తున్నానని తెలిపారు. ఆ అంశంపై టీడీపీ రైతులకు అండగా ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు.





దళిత,  బీసీ రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. అది ఎలా రైతు సంక్షేమం అవుతుందని ప్రశ్నించారు. ఉల్లిపాయలు రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలు రూ.40 అమ్ముతున్నారని ఇది మరీ దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారో లేదో పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. తాము ఏమైనా అడిగితే తమపై వారు ట్వీట్లు చేస్తారని వ్యాఖ్యానించారు. నిధులు రాకపోతే తమపై ట్వీట్లు చేయడం కాదని.. పనికి మాలిన ఎంపీలు ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయాలని ఆయన హితవు పలికారు. అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తుంటే,  బయట నుంచి మనుష్యులను తీసుకు వచ్చి కేసులు పెడుతున్నారన్నారు.  అభివృద్ధి చేయలేకనే,  మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ప్రతిసారి 59 లక్షల ఖర్చుపెట్టి అటూ ఇటూ తిరుగుతున్నాకని.. ఎందుకో తెలీదని.. రాష్ట్రానికి ఏమీ లాభం రాలేదని అన్నారు.  కేంద్రంతో అప్పట్లో తాము రహస్య ఒప్పందం పెట్టుకుందో వారే చెప్పాలన్నారు. షెల్ కంపెనీలు,  రహస్య ఒప్పందాలు చేసుకోవడం ఎంపీ విజయసాయిరెడ్డికే సాధ్యమని..ఆయనే ఆ ఒప్పందాల గురించి చెప్పాలని లోకేష్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-26T19:07:39+05:30 IST