అలా చనిపోవడం మద్యపాన నిషేధంలో భాగమే అంటారేమో!: లోకేష్

ABN , First Publish Date - 2020-08-08T18:29:19+05:30 IST

: శానిటైజర్ తాగి అనేక మంది చనిపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అలా చనిపోవడం మద్యపాన నిషేధంలో భాగమే అంటారేమో!: లోకేష్

అమరావతి: శానిటైజర్ తాగి అనేక మంది చనిపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ప్రభుత్వ దుకాణాలు తెరిచి, సొంత బ్రాండ్లు తెచ్చి, రేట్లు పెంచి మద్యపాన నిషేధం అంటూ కొత్త నిర్వచనం చెప్పారు జగన్ రెడ్డి గారు. ఇప్పుడు శానిటైజర్ తాగించి ప్రజల్ని పొట్టన పెట్టుకోవడం కూడా మద్యపాన నిషేధంలో భాగమే అంటారేమో! నాటు సారా, శానిటైజర్లు తాగి రాష్ట్రవ్యాప్తంగా 30 మంది చనిపోయినా ఈ దున్నపోతు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తిరుపతిలో శానిటైజర్లు తాగి నలుగురు మృతి చెందటం బాధాకరం. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. మ‌ద్యంపేరుతో స‌మాంత‌ర మాఫియా న‌డుపుతున్న జ‌గ‌ర్‌రెడ్డి స‌ర్కారుపై జ్యుడీషియ‌ల్ ఎంక్వయిరీ వేయాలి’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-08-08T18:29:19+05:30 IST