సత్యసాయి జిల్లా ప్రభుత్వ నిర్ణయమే: పల్లె రఘునాథరెడ్డి

ABN , First Publish Date - 2022-01-26T22:27:00+05:30 IST

సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ అభ్యర్థన మేరకే

సత్యసాయి జిల్లా ప్రభుత్వ నిర్ణయమే: పల్లె రఘునాథరెడ్డి

అనంతపురం: సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ అభ్యర్థన మేరకే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాగా ప్రకటన వెలువడిందని మాజీమంత్రి రఘునాథరెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్ణయమేనని ఆయన తెలిపారు. కొత్త జిల్లా ఏర్పాటులో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఘనత ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. అందరి సమిష్టి కృషితోనే జిల్లా సాధ్యమైందన్నారు. తానే జిల్లా సాధించినట్లు శ్రీధర్‌రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. 


కొత్త జిల్లాలో ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా రెండుగా విభజించారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. దీనిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం నియోజక వర్గాలను ఈ జిల్లాలో కలిపారు. ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి (కొ్త్త) అనే మూడు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. 29 మండలాలు ఉంటాయి. 


Updated Date - 2022-01-26T22:27:00+05:30 IST