ధర్మవరానికి రెవెన్యూ డివిజన్ హోదా తొలగించడం దారుణం: Sriram

ABN , First Publish Date - 2022-02-03T19:38:18+05:30 IST

ధర్మవరం రెవెన్యూ డివిజన్ తొలగింపుపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్పందించారు.

ధర్మవరానికి రెవెన్యూ డివిజన్ హోదా తొలగించడం దారుణం: Sriram

అనంతపురం: ధర్మవరం రెవెన్యూ డివిజన్ తొలగింపుపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్పందించారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ధర్మవరానికి రెవెన్యూ డివిజన్ హోదాను తొలగించడం దారుణమైన చర్య అని మండిపడ్డారు. సుమారు 69 ఏళ్లుగా రెవెన్యూ డివిజన్‌గా ఉన్న ప్రాంతానికి ఆ హోదాను తొలగించడం అన్యాయమన్నారు. వ్యాపారానికి, చేనేత పరిశ్రమకు, రైతాంగానికి పెట్టింది పేరైనా ప్రాంతానికి దక్కే గౌరవం ఇదేనా.? అని ప్రశ్నించారు. ధర్మవారానికి ఇంత అన్యాయం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్ల అని మండిపడ్డారు. అధిష్టానం మెప్పుకోసం నియోజకవర్గ ప్రజలను బలిచేస్తావా.? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. టీడీపీ ఆధ్వర్యంలో ధర్మవరం ప్రాంత ప్రజలు, రైతులతో కలసి పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. రెవిన్యూ డివిజన్ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దాకా నిరసనను తెలియజెస్తామని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-03T19:38:18+05:30 IST