నరేంద్ర అరెస్ట్ దుర్మార్గం: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-23T14:51:18+05:30 IST

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు.

నరేంద్ర అరెస్ట్ దుర్మార్గం: సోమిరెడ్డి

గుంటూరు: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి నుంచి వారి కుటుంబం హుందా రాజకీయాలకు మారుపేరని తెలిపారు. సంఘం డెయిరీని పాడి రైతులకు తిరుగులేని ఆస్థిగా తీర్చిదిద్దిన ఘనత వారిదని చెప్పుకొచ్చారు. నరేంద్రపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులు హద్దు మీరిపోయాయని..తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సోమిరెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-04-23T14:51:18+05:30 IST