నెక్లెస్‌ రోడ్డు కనిపించడం లేదా శ్రీధర్‌రెడ్డీ?

ABN , First Publish Date - 2022-07-08T03:50:22+05:30 IST

నగర ప్రజల ఆహ్లాదం కోసం నిర్మించిన నెక్లెస్‌ రోడ్డు దారుణంగా తయారై ఉంటే అది రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కనిపించడం లేదా.. అని టీడీపీ నగరాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ప్రశ్నించారు.

నెక్లెస్‌ రోడ్డు కనిపించడం లేదా శ్రీధర్‌రెడ్డీ?
నెక్లెస్‌ రోడ్డును శుభ్రం చేస్తున్న టీడీపీ నేతలు

టీడీపీ నగరాధ్యక్షుడు ధర్మవరం

నెల్లూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : నగర ప్రజల ఆహ్లాదం కోసం నిర్మించిన నెక్లెస్‌ రోడ్డు దారుణంగా తయారై ఉంటే అది రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కనిపించడం లేదా.. అని టీడీపీ నగరాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ప్రశ్నించారు. గురువారం నెల్లూరు చెరువు గట్టుపై నిర్మించిన నెక్లెస్‌ రోడ్డును టీడీపీ నేతలు పరిశీలించారు. రోడ్డు అపరిశుభ్రంగా ఉండడం, మహనీయుల విగ్రహాల వద్ద మద్యం సీసాలు ఉండడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చీపుర పట్టి నెక్లెస్‌ రోడ్డును శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేశారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నెక్లెస్‌ రోడ్డు తయారైందన్నారు. రూ.కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన ఈ రోడ్డును వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. మంత్రిగా అనిల్‌కుమార్‌ నెక్లెస్‌ రోడ్డును పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వైసీపీ నేతలకు ప్రజలంటే ఎలాగూ గౌరవం లేదని, కనీసం మహనీయులన్నా కూడా గౌరవం లేదా అని ప్రశ్నించారు. కలెక్టర్‌ వెంటనే జోక్యం చేసుకొని నెక్లెస్‌ రోడ్డును ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు జాఫర్‌ మొహిద్దీన్‌, కంచి మల్లికార్జునరెడ్డి, పాలూరు నాగేశ్వరరావు, గజ్జల నాగార్జున, ధర్మవరం గణేష్‌కుమార్‌, పీ రమేష్‌, చంద్రశేఖర్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-08T03:50:22+05:30 IST