వడ్డీతో సహా తీర్చుకుంటాం: తిక్కారెడ్డి

Published: Sat, 11 Dec 2021 20:47:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వడ్డీతో సహా తీర్చుకుంటాం: తిక్కారెడ్డి

కర్నూలు: తనపై జరిగిన దాడి విషయంలో ప్రతి రక్తపు బొట్టుకు వడ్డీతో సహా తీర్చుకుంటామని టీడీపీ నేత తిక్కారెడ్డి స్పష్టం చేశారు. బాలనాగిరెడ్డి సహకారంతో వైసీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తల తలలు పగిలాయని ఆయన తెలిపారు. 


 జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం  జరిగిన విషయం తెలిసిందే. కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిక్కారెడ్డి వర్గీయులపై  వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు.  వైసీపీ శ్రేణులను తిక్కారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.