కేబినెట్ కూర్పుపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-12T18:00:53+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ కూరపుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేబినెట్ కూర్పుపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ది ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అని అన్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదని తెలిపారు. జగన్ కిచెన్ కేబినెట్‌లో.. సలహదారుల బృందంలోనో బీసీలు ఎందుకు లేరని ప్రశ్నించారు. ప్రాధాన్యత, పెత్తనం లేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారని నిలదీశారు. ఈ కెబినెట్లో బడుగులకు ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. బడుగులకు ఎంత మందికి చోటు కల్పించామనే దాని కంటే ఎంత  ప్రాధాన్యత ఇచ్చారనేదే ముఖ్యమని ఆయన అన్నారు. జగన్ కేబినెట్‌లో పాత బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసేసి.. కొత్త వారికి ఇచ్చారని చెప్పారు. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యమే కాదు.. ప్రాధాన్యత కూడా వచ్చిందని గుర్తు చేశారు. పవర్.. మనీ రెండూ జగన్ వద్దే ఉందని అన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి ఎవరు..? సీఎం సన్నిహితుడైతే మంత్రులను డిక్టేట్ చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్‌లో బీసీలు ఉండాలి కాబట్టి.. ఇస్తున్నారంతే అని టీడీపీ నేత అన్నారు.


జగన్ డెమొక్రాటిక్ డిక్టెటర్ అని విమర్శించారు. చంద్రబాబు తమలాటి వారితో సంప్రదింపులు జరిపేవారని.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారని చెప్పుకొచ్చారు. జగన్ ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రజల్లో వైసీపీ పట్ల నెగిటివ్ ఉందని.. అందుకే పార్టీలో కూడా కొంత మంది తిరగబడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పార్టీలో ఒత్తిళ్లకు జగన్ లొంగక తప్పనిసరైందన్నారు. వైసీపీలో అసంతృప్తి మొదలైందని.. జగన్‌పై తిరగబడుతున్నారని ఇటీవల జరిగిన పరిణామాల ద్వారా అర్ధమవుతుందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-12T18:00:53+05:30 IST