ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా?

ABN , First Publish Date - 2021-03-02T06:25:18+05:30 IST

ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా?

ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా?

మధురానగర్‌, మార్చి 1 : ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబును ప్రజలలోకి వెళ్లకుండా అడ్డుకోవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో నడస్తున్నది ప్రజాస్వామ్యమాలేక నియంతృ త్వమా అని సందేహం వస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబును చిత్తూరు, తిరుపతి పర్యటనకు వెళ్లకుండా  విమానాశ్రయంలో అడ్డుకోవడానికి నిరసనగా మధురానగర్‌లో  నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్ర బాబును చూసి జగన్‌ భయపడుతున్నాడని ఇది ప్రభుత్వ పిరికిపంద చర్య అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో దాడు లకు, దౌర్జన్యాలకు పాల్పడిన విధంగా మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా  దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నా రని ఆ ఆటలు సాగవ న్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న పుడు జగన్‌ పాదయాత్రకు అనుమతి ఇవ్వ బట్టే  ప్రజలకు   మాయమాటలు చెప్పి సీఎం అయ్యాడని దుయ్య బట్టారు.  ప్రజా వ్యతిరేక విధానాలను పాల్ప డుతున్న జగన్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి ఆత్కూరి జానకీ అరవింద్‌, డివిజన్‌ అద్యక్షులు పివిఆర్‌,గౌతమి ప్రసా ద్‌, సింగం వెంకన్న, సుంకర కిరణ్‌, పప్పయ్య పాల్గొన్నారు. 

జి.కొండూరు, రెడ్డిగూడెంలో..

జి.కొండూరు / రెడ్డిగూడెం: మాజీ సీఎం చంద్ర బాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని పలువురు టీడీపీ నేతలు అన్నారు. చంద్రబాబును అక్రమంగా అడ్డుకోవడాన్ని నిర సిస్తూ జి.కొండూరు, రెడ్డిగూడెంలో టీడీపీ నేతలు ఆదివారం నిరసన ప్రదర్శన చేశారు. జి.కొండూరులో ఉయ్యూరు వెంకట నరసింహారావు, పజ్జూరు రవికుమార్‌, అంకెం సురేష్‌, గరికపాటి జైపాల్‌, కావిటి వెంకట్రావ్‌, పజ్జూరు వెంకటేశ్వరరావు, ఆర్‌.ఆర్‌ సూరి బాబు, బాధినేని సీతారామరాజు, బడుగు రమేష్‌, పటాపంచల శ్రీనివాసరావు, రెడ్డిగూ డెంలో ముప్పిడి నాగేశ్వరరెడ్డి, జానలపాటి వేణుగోపాల్‌ రెడ్డి, ఇజ్రాయిల్‌, కె.విజయ బాబు, కుప్పిరెడ్డి అశోక్‌రెడ్డి, పాలంకి సురేష్‌ రెడ్డి, వెలివెల రాఘవులు  పాల్గొన్నారు. 

కొండపల్లిలో..

 ఇబ్రహీంపట్నం : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేయటం హేయమైన చర్య అని టీడీపీ నేతలు చుట్టుకుదురు శ్రీనివాసరావు, చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు. సోమవారం చిత్తూరు పర్యటనకు ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకుని వెళుతున్న చంద్రబాబునాయుడును పోలీసులతో అడ్డుకున్న ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కొండపల్లిలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల మీద రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని కాని వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడ హరించివేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో మైలా సైదులు, ఎం.ఎ.హైదర్‌, చుట్టుకుదురు వాసు, గౌరా శ్రీనివాసరావు, భయ్యారాము చినుకుని విజయ తదితరులు పాల్గొన్నారు.

మైలవరంలో..

మైలవరం : టీడీపీ అధినేత నారా చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడం పిరికిపంద చర్యని  టీడీపీ మండల నేతలు ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు చిత్తూరు, తిరుపతి పర్యటనకు వెళ్తుంటే ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులను అడ్డుపెట్టుకో వడం జగన్‌మోహన్‌రెడ్డి పిరికిపంద చర్యని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై దాడులు చేస్తుంటే ఆ అభ్యర్థులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే అడ్డుకోవడం సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ సమా వేశంలో టీడీపీ  మండల అధ్యక్షుడు తాతా పోతురాజు.  పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల రాధాకృష్ణ. సుబానీ, కరీం, మధు, అంజి, కన్యయ్య, రామకృష్ణ, మస్తాన్‌, దాదర్‌, గౌస్‌, జల్లికృష్ణ, రాముడు  పాల్గొన్నారు.

చంద్రబాబు పేరు వింటే జగన్‌ ఉలిక్కి పడుతున్నాడు

విద్యాధరపురం  : టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు పేరు వింటేనే జగన్‌రెడ్డి ఉలిక్కిపడుతున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య దరర్శి కొత్త నాగేంద్రకుమార్‌ అన్నారు. సోమవారం ఆటోనగర్‌లోని  టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ప్రతిపక్షనేత చంద్ర బాబును రేణిగుంట ఎయిర్‌ పోర్టులో నిర్బం ధించటాన్ని తీవ్రంగా ఖండించారు. మంత్రు లు, వైసీపీ నాయకుల తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారనే భయంతోనే చంద్రబాబు పర్యటనను అధికారపార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులకు చంద్రబాబు ఫోబియా పట్టు కుందని, సంక్షేమ పథకాల వెల్లువలో ప్రజలు తమతోనే ఉన్నారంటున్న జగన్‌రెడ్డి ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.  ఓటమి  భయంతోనే వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారన్నారు.  జగన్‌రెడ్డి 90 శాతం టార్గెట్‌ సాధించి మంత్రి పదవులు కాపాడుకో వటానికి మం త్రులు వీధి రౌడీలుగా ప్రవర్తిస్తూ ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు.

Updated Date - 2021-03-02T06:25:18+05:30 IST