హారన్ మోగిస్తూ నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు
హారన్లు మోగించి టీడీపీ నాయకుల వినూత్న నిరసన
నూజివీడు, మే 25: పెట్రోల్ ధరల పెంపుపై యనమదల పెట్రోల్ బంకు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిద్ర పోతున్న జగన్ మేలుకో అంటూ వాహ నాల హారన్ మోగిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు దఫాలు పెట్రోల్ ధరలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సెస్ పేరుతో మరో రెండు రూపాయల అదనపు భారం ప్రజలపై పెనుభారం అన్నారు. నూజివీడు మండల, పట్టణ అధ్యక్షులు ముసునూరు రాజా, మల్లిశెట్టి జగదీష్, పార్టీ నాయకులు తాలం వెంకటేశ్వరరావు, జగ్గవరపు వెంకట రెడ్డి, గద్దె రఘు, వీరమాచనేని సత్యనారాయణ, దాసరి స్వామి యాదవ్ పాల్గొన్నారు.