Peddireddy రామచంద్రారెడ్డి ఓటమి ఎరుగని ధీరుడా.. అదెలాగా..!?

ABN , First Publish Date - 2022-02-02T12:35:21+05:30 IST

Peddireddy రామచంద్రారెడ్డి ఓటమి ఎరుగని ధీరుడా.. అదెలాగా..!?

Peddireddy రామచంద్రారెడ్డి ఓటమి ఎరుగని ధీరుడా.. అదెలాగా..!?

  • టీడీపీ జెండాను చూస్తే భయమెందుకో?  
  • రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని విమర్శించే హక్కు ప్రదీప్‌కు లేదు 
  • మీ పెద్దాయన నాలుగు సార్లు ఓడిపోలేదా?

చిత్తూరు జిల్లా/చౌడేపల్లె : తమ పార్టీ జెండాను చూస్తూ వైసీపీ నాయకులు భయపడిపోతున్నారని   టీడీపీ నాయకులు అన్నారు. మంగళవారం టీడీపీ మండల ఉపాధ్యక్షుడు రామచంద్ర ఇంటి వద్ద జరిగిన సమావేశంలో ఆ పార్టీ ప్రచార కార్యదర్శి మునివెంకటప్ప మాట్లాడుతూ... రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని విమర్శించే స్థాయి ప్రదీప్‌రాజుకు లేదన్నారు.  వందలాది ఎకరాల డీకేటీ భూములను కాపాడుకునేందుకు పార్టీలు మారే  వ్యక్తికి... టీడీపీని, చంద్రబాబును, చల్లా రామచంద్రా రెడ్డి విమర్శించే అర్హత లేదన్నారు. ట్విటర్‌ బాబు, సూట్‌కేసుల బాబు అని విమర్శించిన ప్రదీప్‌.. ఎన్నికల సమయంలో శ్రీనాథరెడ్డి, రామచంద్రయాదవ్‌ వద్ద డబ్బు తీసుకోలేదా? అని ప్రశ్నించారు.


రాజంపేట పార్లమెంట్‌ తెలుగుయువత అధ్యక్షుడు రెడ్డెప్పనాయుడు మాట్లాడుతూ... 1978లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో సైఫుల్లా బేగ్‌పైన, 1983లో జరిగిన సమితి ఎన్నికల్లో ఎన్‌. రామకృష్ణారెడ్డి పైన, 1985లోజరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో చల్లా ప్రభా కర్‌రెడ్డి పైన, 1994లో జరిగిన ఎమ్మెల్యే ఎన్ని కల్లో శ్రీనాథరెడ్డిపైన మొత్తంగా నాలుగు మార్లు  ఓడిపోయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి... ఓటమి ఎరుగని ధీరుడు అన్ని చెప్పుకో వడం భావ్యం కాదన్నారు.  తన కుటుంబీకుల ట్రాన్స్‌ఫర్‌ కోసం శ్రీరామ్‌ చిన్నబాబు ద్వారా అప్పటి సీఎం నల్లారి కిరణ్‌ను సాయం కోరిన విషయం మరిచావా? అంటూ మిద్దింటి కిశోర్‌‌ను ఎద్దేవా చేశారు.  


తమ పార్టీ రాజకీయ భిక్షతో ఎదిగిన  చౌడేపల్లె సర్పంచు వరుణ్‌ భరత్‌, పదేళ్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న వెంకటరమణరాజు తనయుడు ప్రదీప్‌ రాజుకు టీడీపీని విమర్శించే అర్హత లేదన్నా రు. గతంలో ప్రదీప్‌ సోదరుడిని నిర్బంధిస్తే చల్లా రామచంద్రారెడ్డి, టీడీపీ కార్యకర్తలే కా పాడిన విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నార న్నారు. పుంగనూరు మండల పార్టీ ఉపాధ్య క్షుడు సుబ్రహ్మణ్యంరాజు, రాజంపేట పార్ల మెంట్‌ అధికార ప్రతినిధి కళ్యాణ్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు విజయ్‌, తెలుగుయువత ఉపాధ్యక్షుడు కుమార్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, బీసీ సెల్‌ మండల ధ్యక్షుడు మునివెంకటరమణ, వెంకటరమణ,  హరీష్‌రాయల్‌, విజయభాస్కర్‌రెడ్డి, మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-02T12:35:21+05:30 IST