రంగనాథుడి ఆలయం ఎదుట టీడీపీ ధర్నా

ABN , First Publish Date - 2022-07-08T03:53:18+05:30 IST

నగరంలోని రంగనాయకులపేటలో వెలసిన తల్పగిరి రంగనాథుడి ఆలయం ఎదుట గురువారం టీడీపీ బీసీ నాయకులు ధర్నా చేశారు.

రంగనాథుడి ఆలయం ఎదుట టీడీపీ ధర్నా
ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు

నెల్లూరు(సాంస్కృతికం), జూలై 7: నగరంలోని రంగనాయకులపేటలో వెలసిన తల్పగిరి రంగనాథుడి ఆలయం ఎదుట గురువారం టీడీపీ బీసీ నాయకులు ధర్నా చేశారు. ెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆలయం ఎదుట నిరసనలతో బైఠాయించారు. వారు మాట్లాడుతూ ఆలయ గాలిగోపురంలో ఎల్‌ఈడీ లైట్స్‌తో ఉన్న శంఖు, చక్ర నామాలను తొలగించి వాటి స్థానంలో శాశ్వత శంఖు చక్రం తిరునామం ఏర్పాటు చేశారని, ఈ శంఖు చక్ర నామాలకు వైసీపీ రంగులు వేసి అపచారం చేశారని పేర్కొన్నారు. రంగనాథుడితో ఆటలాడితే సర్వనాశనం అవుతారని శాపనార్థాలు పెట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆ రంగులు తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలకు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రితో పాటు మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో మహిళా నేత రేవతి, వెంకయ్యయాదవ్‌, ఇక్బాల్‌, రియాజ్‌, శ్రీదేవి, నారా శ్రీనివాసులు, నాగరాజు, సోనీ, గోవిందమ్మ, సుధీర్‌, కిషోర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-08T03:53:18+05:30 IST