జగన్‌ పాలనలో బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-06-28T05:22:10+05:30 IST

జగన్‌ పాలనలో అధిక ధరలు, పన్నులు, చార్జీలతో పెంపుతో రాష్ట్ర ప్రజలపై బాదుడే బాదుడే తీరుగా భారం మోపుతున్నారని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి విమర్శించారు.

జగన్‌ పాలనలో బాదుడే బాదుడు
భీమవరంలో టీడీపీ నేతల నిరసన ప్రదర్శన

భీమవరం అర్బన్‌, జూన్‌ 27: జగన్‌ పాలనలో అధిక ధరలు, పన్నులు, చార్జీలతో పెంపుతో రాష్ట్ర ప్రజలపై బాదుడే బాదుడే తీరుగా భారం మోపుతున్నారని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి విమర్శించారు. పట్టణంలోని 27వ వార్డు చేపల బజార్‌ ప్రాంతంలో పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సోమవారం బాదుడే బాదుడు పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్థసారథి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమండ్‌ చేశారు. పార్టీ కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళ, అమ్మఒడి పథకాలకు కొత్త నిబంధనలు విధించడం సరికాదన్నారు. రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు మేరగాని నారాయణమ్మ, మామిడిశెట్టి ప్రసాదు, మైలాబత్తుల ఐజాక్‌ బాబు, లంకి చిన్ని, విజ్జోరోతు రాఘవులు, రామిశెట్టి శివ, ముచ్చకర్ల శివ, ఎండీ నౌషాద్‌, తదితరులు పాల్గొన్నారు.


మొగల్తూరు: రాష్ట్రంలో వైసీపీది అసమర్థ పాలన అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పొత్తూరి రామరాజు అన్నారు. జగన్నాధపురంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చేను చీడపట్టి పాడైన చందంగా రాష్ట్రం ఉందన్నారు. నిత్యావసర ధరలు, విద్యుత్‌ చార్జీలు మోత, చెత్త పన్ను ఆర్టీసీ చార్జీలు పెంపు భారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే రాష్ట్ర భవిష్యత్‌కు మార్గం అన్నారు. కార్యక్రమంలో గుబ్బల నాగరాజు, జోగి పండు, కత్తిమండ ముత్యాలరావు, కొల్లాటి బాలకృష్ణ, జంపన రాధాకృష్ణంరాజు, ఇందుకూరి కృష్ణంరాజు, శ్రీనురాజు, నడింపల్లి శ్యామ్‌ కుమార్‌ రాజు, తిరుమాని శశిదేవి, జక్కం శ్రీమన్నారాయణ, బొర్రా చిన్నాయమ్మ, పెచ్చెట్టి నాగేశ్వరరావు, సంకు భాస్కర్‌, విప్పర్తి వెంకటేశ్వరావు, మల్లాడి మూర్తి, బోగిరెడ్డి ముత్యం, అండ్రాజు లక్ష్మణ్‌, కడిమి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

––––––––––––––––––––––––

Updated Date - 2022-06-28T05:22:10+05:30 IST