ఐటీడీపీ కార్యకర్తలతో గౌరు దంపతులు
కల్లూరు, మార్చి 27: వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐటీడీపీ కార్యకర్తలు కీలకంగా వ్యవహరించాలని టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాణ్యం ఇన్చార్జి గౌరు చరిత దిశానిర్దేశం చేశారు. ఆదివారం గౌరు దంపతులు తమ స్వగృహంలో ఐటీడీపీ అభ్యర్థుల నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు సోషల్ మీడియా కీలకం కానుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐటీడీపీ కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలన్నారు. టీడీపీకి క్రియాశీలకంగా పని చేస్తున్న ఐటీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ధైర్యంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ కల్లూరు మండల కన్వీనర్ డి.రామాంజినేయులు, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు చౌడయ్య, ఉపా ధ్యక్షుడు ఆయూబ్ బాషా, వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి నారాయణ, అమ్జానాయక్, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.