పూజలు చేసేందుకు హాజరైన గన్నితో టీడీపీ నాయకులు
భీమడోలు, జనవరి 19: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ కరోనా నుంచి కోలుకోవాలంటూ టీడీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు భీమడోలులోని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి రూపక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.