దుల్హన్‌ పథకం తొలగించడం అన్యాయం

ABN , First Publish Date - 2022-06-26T04:12:03+05:30 IST

దుల్హన్‌ పథకాన్ని తొలగించి ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరని అన్యాయం చేశారని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ ఆరోపించారు.

దుల్హన్‌ పథకం తొలగించడం అన్యాయం
మాట్లాడుతున్న మైనారిటీ నాయకులు

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 25: దుల్హన్‌ పథకాన్ని తొలగించి ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరని అన్యాయం చేశారని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ ఆరోపించారు. శనివారం స్థానిక చెంచలబాబు అతిథిగృహంలో ముస్లిం మైనారిటీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింల అభివృద్ధి శూన్యమన్నారు. ముస్లింలకు అన్యాయం జరుగుతుంటే నోరుమెదపని మైనారిటీ వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఓ దద్దమని ఎద్దేవా చేశారు. నేరచరిత కలిగిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమన్నారు. ఆంక్షల పేరుతో అమ్మఒడి పథకానికి సంబంధించి 1.70 లక్షల లబ్ధిదారులను తొలగించడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన దుల్హన్‌ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోర్టు ద్వారా నిలిపి వేయించడం అన్యాయమన్నారు. దీంతోపాటు విదేశీ విద్య, రంజాన్‌తోఫా, స్వయం ఉపాధి కోసం మైనారిటీ కార్పొరేషన్‌ రుణాలును రద్దు చేసి ముస్లింల అగ్రహానికి గురయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందానీ, గయాజ్‌, అలీజాన్‌, ఇలియాజ్‌, ఖాదర్‌బాషా, బొజ్జా నరసింహులు, నల్లిపోగు రాజా, వెంకటస్వామి, ఓబులరెడ్డి, మాబాషా, అబీద్‌, యస్థాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T04:12:03+05:30 IST