జూ.ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య వ్యాఖ్యలు కరెక్ట్: TDP leaders

ABN , First Publish Date - 2021-11-25T17:43:22+05:30 IST

జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా అన్నారు.

జూ.ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య వ్యాఖ్యలు కరెక్ట్: TDP leaders

విజయవాడ: జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా అన్నారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య చేస్తున్న దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుద్దావెంకన్న, నాగుల్ మీరా మాట్లాడుతూ... జూనియర్‌పై తమ మనసులో ఉందే... వర్ల రామయ్య బయట పెట్టారన్నారు. జూనియర్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు ఏంటి జూనియర్ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారని తెలిపారు. ప్రవచనాలు చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ సుభాషితలు పలికారని మండిపడ్డారు. ఒక వర్ల రామయ్య మనసులో మాటే  కాదు...తెలుగు ప్రజల భావన అందరిదీ అంతే అని చెప్పుకొచ్చారు. మేనత్తపై వైసీపీ నాయకులు నీచమైన భాష మాట్లాడినా జూనియర్ స్పందించి తీరు మాత్రం తమను బాధిస్తోందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అసలు నందమూరి సంబంధించిన వ్యక్తిలా స్పందించలేదన్నారు. మామయ్య, అత్త అని అనుకోవడం కాదని...వారికి కష్టం వస్తే బయటకి వచ్చి మాట్లాడాలని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా అన్నారు. 

Updated Date - 2021-11-25T17:43:22+05:30 IST