చంద్రబాబే సీఎం కావాలి

ABN , First Publish Date - 2022-05-23T06:46:25+05:30 IST

ఆంధ్రప్రదేశకు మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.

చంద్రబాబే సీఎం కావాలి
మినీ మహానాడులో మాట్లాడుతున్న రెడ్డి సుబ్రహ్మణ్యం

  • ఆయన పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు 
  • శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన రెడ్డి సుబ్రహ్మణ్యం 
  • ‘మినీ మహానాడు’కు భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

రాజోలు, మే 22: ఆంధ్రప్రదేశకు మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. తాటిపాకలోని ఎస్వీఎస్‌ గ్రాండ్‌ లక్ష్మీ పరిణయ వేదికలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఆదివారం జరిగిన టీడీపీ రాజోలు నియోజకవర్గ మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జగన ప్రజలకు అనేక హామీలిచ్చి మాట తప్పారని, మడమ తిప్పారని ధ్వజమెత్తారు. మూడేళ్లలో 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఒక్క రూపాయి రుణం కూడా ఇవ్వని ఘనత ఈ సీఎంకే దక్కుతుందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఏమి చేశారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణను ప్రశ్నించారు. బీసీలకు ఏమైనా చేశానని చెబితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. ఎన్నికల హామీల్లో పెన్షన రూ.3వేలు ఇస్తానని చెప్పి రూ.2500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజోలు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో టీడీపీకి పూర్వవైభవం తప్పక వస్తుందనిపిస్తోందన్నారు. భావి తరాల కోసం ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక, రాక్షస పాలన సాగుతోందన్నారు. అమలాపురం పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదులో రాజోలు నియోజకవర్గానికి మొదటి స్థానం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జగన పరిపాలనలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలంతా సమష్టి కృషి చేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవం వస్తోందన్నారు. జగన అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. తొలుత రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్‌ స్వగృహం నుంచి సమావేశ ప్రాంగణానికి తీనమార్‌ డప్పులు, మేళాతాళాలు, బాణసంచా కాల్పులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. తాటిపాకలో రోడ్లన్నీ పసుపుమయంగా మారాయి. మండుటెండలో మహిళలు, కార్యకర్తలు మినీ మహానాడుకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యా ఘటనపై గొల్లపల్లి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సమగ్ర విచారణ జరిపించి, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని  డిమాండు చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలన్నారు. కార్యక్రమంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, టీడీపీ మండల అధ్యక్షుడు గుబ్బల శ్రీను, అడబాల యుగంధర్‌, ముప్పర్తి నాని, మొల్లేటి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శులు చాగంటి స్వామి, రాపాక నవరత్నం, తాడి సత్యనారాయణ, వర్థినీడి బాబ్జీ, మంగెన భూదేవి, దంతులూరి రామకృష్ణంరాజు, గెడ్డం నరసింహమూర్తి, శ్రీనివాసరాజు, బోళ్ల వెంకటరమణ, అడబాల సాయిబాబు, ముదునూరి గోపాలకృష్ణంరాజు, కసుకుర్తి త్రినాథస్వామి, బందెల పద్మ, కాండ్రేగుల భవానీ, ఈలి శ్రీనివాస్‌, బిక్కిన వీరాస్వామి, బోనం నాగేశ్వరరావు, కేసరి మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-23T06:46:25+05:30 IST