రణన్నినాదం

ABN , First Publish Date - 2022-09-24T06:02:15+05:30 IST

ఉద్యోగాల కల్పనలో వైసీపీ విఫలమైందని ‘దేశం’ నాయకులు ధ్వజమెత్తారు.

రణన్నినాదం
కైకలూరు నుంచి ర్యాలీగా తెలుగు యువత, టీడీపీ నాయకులు

ఉద్యోగాల కల్పనలో వైసీపీ విఫలం

జాబ్‌ క్యాలెండర్‌  విడుదలకు డిమాండ్‌

ఏలూరులో ‘నిరుద్యోగ రణం’కు తరలిన యువత, టీడీపీ శ్రేణులు


ఉద్యోగాల కల్పనలో వైసీపీ విఫలమైందని ‘దేశం’ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం ఏలూరులో జరిగిన నిరుద్యోగ రణం కార్యక్రమానికి కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల నుంచి తెలుగు యువత, టీడీపీ నాయకులు తరలివెళ్లారు. తక్షణం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 


కైకలూరు, సెప్టెంబరు 23: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ అన్నారు. శుక్రవారం కైకలూరు టీడీపీ కార్యాలయం నుంచి ఏలూరులో  జరిగే ధర్నాకు రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి పూల రామ చంద్రరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దావు నాగరాజు ఆధ్వర్యంలో యువత, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్ళారు. ర్యాలీని జయమంగళ వెంకట రమణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా జయమంగళ మాట్లాడుతూ వైసీపీ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావడం, యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పెన్మెత్స త్రినాధరాజు, జిల్లా  కార్యనిర్వహక కార్యదర్శి పోలవరపు లక్ష్మీరాణి, టీడీపీ నాయకుడు బీకేఎం నాని, తెలుగు యువత నాయకులు చక్కా పూర్ణ, ఈదా వెంకటస్వామి, పట్నాల కొండప్రసాద్‌, ఆసానీ ఖాన్‌, కనిశెట్టి శ్యామ్‌, కంచర్ల రామకృష్ణ, తలారి రాజేష్‌, ఆచంట వినయ్‌, తోట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు టౌన్‌: ఏలూరు పార్లమెంట్‌ స్థాయి నిరుద్యోగ రణం కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు నూజివీడు నుంచి తరలివెళ్ళాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు యువత ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ రణానికి శ్రేణులు భారీగా తరలివెళ్ళగా ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గద్దె రఘు, నాయకులు గోగినేని మధుకిరణ్‌, తుమ్మల ఆది, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చలసాని గోపాలకృష్ణ, గోళ్ళరాజు, బొంతు సతీష్‌, సాయిల అనిల్‌, రాపర్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ముసునూరు: నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని జగన్‌ రెడ్డి నిలబెట్టుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఏలూరు లో నిర్వహించిన నిరుద్యోగ రణం కార్యక్రమానికి మండల వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బైక్‌లపై ర్యాలీగా తరలివెళ్ళాయి. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తానని నిరుద్యోగులకు ఆశ కల్పించి, గద్దెనెక్కిన జగన్‌ నేడు ఆ హామీని తుంగలో తొక్కాడని  విమర్శించారు.   జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసి  హామీని నెరవేర్చాలని  నినాదాలు చేశారు. 



Updated Date - 2022-09-24T06:02:15+05:30 IST