టీడీపీ జోష్‌..

ABN , First Publish Date - 2022-05-28T06:30:29+05:30 IST

ఒంగోలులో శుక్ర, శనివారా ల్లో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు శుక్రవారం జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లడంతో జోష్‌ నెలకొంది.

టీడీపీ జోష్‌..
మహానాడులో కామవరపుకోట టీడీపీ నాయకులు

మహానాడుకు తరలి వెళ్లిన పార్టీ నాయకులు 

కామవరపుకోట, మే 27 :ఒంగోలులో శుక్ర, శనివారా ల్లో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు శుక్రవారం జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లడంతో జోష్‌ నెలకొంది. కామవరపుకోట మండ లంలో పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని పసుపు జెండాలు చేతపట్టుకున జై చంద్రబాబు.. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ పలు వాహనాల్లో తరలివెళ్లారు. బీసీ సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్‌ అశోక్‌గౌడ్‌ మిత్రబృందం ఓ గ్రూపుగా తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, టీడీపీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, ఏలూరు పార్లమెంట్‌ రైతు విభాగం ఉపాధ్యక్షుడు మద్దిపోటి నాగేశ్వరరాంబాబు, గుంటుపల్లి సర్పంచ్‌ గోరీక దాసు, ఆడమిల్లి సర్పంచ్‌ గూడపాటి కేశవరావు, రావికంపాడు సర్పంచ్‌ వేముల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు తరలివెళ్ళిన బృందంలో ఉన్నారు.

చింతలపూడి, మే 27 : చింతలపూడి నుంచి వంద మంది, లింగపాలెం నుంచి అరవై మంది మహానాడుకు తరలి వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీ మండల అధ్యక్షుడు ఎం.వెంకట్రామయ్య, జె. ముత్తారెడ్డి తదితరులు మాట్లాడుతూ రానున్నది టీడీపీ ప్రభుత్వమన్నారు. మహానాడులో మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్‌, పలువురు నాయకుల తో కలిసినట్టు తెలిపారు. లింగపాలెం మండలం నుంచి గరిమెళ్ళ చలపతిరావు, మోరంపూడి మల్లికార్జునరావు తదితరులు వెళ్లారు. 

కొయ్యలగూడెం, మే 27: నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు వాహనాల్లో తరలివెళ్లి మొదటి రోజు శుక్రవారమే అధినేత చంద్రబాబును కలిశారు. టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌, ఏఎంసీ మాజీ చైర్మన్లు పారేపల్లి రామారావు, సోంబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షు రాలు చింతల వెంకటరమణ, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి, మహిళా నేతలు తరలి వెళ్లారు. 

ఫ జంగారెడ్డిగూడెం, మే 27 : చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో ముఖ్య నాయకు లు, కార్యకర్తలు తరలివెళ్లారు. మొదటి రోజులో భాగంగా ఏలూరు జిల్లాకు సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌చంద్రశేషు ప్రసంగిం చారు. మహానాడు ప్రాంగణమంతా శేషు ప్రసంగంతో హర్షధ్వానాలతో మార్మోగింది.  

గణపవరం, మే 27: మండలం నుంచి తెలుగుతమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం మహానాడు విరామం సమయంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటు పలువురు రాష్ట్రస్థాయి నాయకులను కలిసి ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా రైతు సంఘం కార్యదర్శి కవల కొదండ రాంబాబు విలేకరులకు ఫోన్‌లో మాట్లాడుతూ మహానాడులో ఉపన్యాసాలు ఉత్సాహనిచ్చాయన్నారు. 





Updated Date - 2022-05-28T06:30:29+05:30 IST