NTR Centenary Celebrations: ఏడాది పాటు వేడుకలకు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-07-27T22:50:34+05:30 IST

‘ప్రపంచ తెలుగు ప్రజల గుండె చప్పుడు NTR’ అని NRI యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. ‘జాతి నిర్మాణం వైపు తెలుగు ప్రజలను జాగృతం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. ఆయ

NTR Centenary Celebrations: ఏడాది పాటు వేడుకలకు సన్నాహాలు

ఎన్నారై డెస్క్: ‘ప్రపంచ తెలుగు ప్రజల గుండె చప్పుడు NTR’ అని NRI యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. ‘జాతి నిర్మాణం వైపు తెలుగు ప్రజలను జాగృతం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. ఆయన నేటి తరానికి ఒక స్ఫూర్తి. భావితరాలకు ప్రేరణ. అందుకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించబోతున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నెల ఒక రాష్ట్రంలో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే బోస్టన్, న్యూజెర్సీలో నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్ఆర్ఐ తెలుగుదేశం(Telugu Desham) ఆధ్వర్యంలో 3వ మినీ మహానాడు జులై 31వ తేదీ ఆదివారం కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సబ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిలుగా పాల్గొంటారని వెల్లడించారు. ఈ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. 




Updated Date - 2022-07-27T22:50:34+05:30 IST