వైసీపీకి తొత్తులుగా మారిన పోలీసులు

ABN , First Publish Date - 2021-11-26T06:03:09+05:30 IST

వైసీపీ నాయకులకు పోలీసులు తొత్తులుగా మారారని టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తక్‌అహ్మద్‌ తెలిపారు.

వైసీపీకి తొత్తులుగా మారిన పోలీసులు
సైదాను పరామర్శిస్తున్న మౌలానాఅహ్మద్‌, నసీర్‌అహ్మద్‌, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, నల్లపాటి రామచంద్రప్రసాదు

టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు 

నరసరావుపేట ఆస్పత్రిలో సైదాకు నేతల పరామర్శ

నరసరావుపేట టౌన్‌, నవంబరు 25: వైసీపీ నాయకులకు పోలీసులు తొత్తులుగా మారారని టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తక్‌అహ్మద్‌ తెలిపారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువుకు చెందిన షేక్‌ సైదాను గురువారం వారు పరామర్శించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రౌడీ రాజ్యం ఉందా? అని ప్రశ్నించారు. కొందరు పోలీసులు వైసీపీకి లొంగి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని విమర్శించారు. సైదాపై దాడికి పాల్పడిన శివారెడ్డి, అతడి అనుచరులపై 307 సెక్షను కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. అబ్దుల్‌ సలామ్‌ ఆత్మహత్య,  హాజీరాని అత్యాచారం హత్య, అలీషాను అత్మహత్య చేసుకునేటట్లు ఒత్తడి చేశారని వీటిని చూస్తుంటే రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ లేదని తెలుస్తుందన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్‌ నసీర్‌అహ్మద్‌ మాట్లాడుతూ జగన్‌రెడ్డి ఫ్యాక్షన్‌ పరిపాలన చేస్తున్నారన్నారు. పల్నాడు ప్రాంతంలో వంద ముస్లిం కుటుంబాలు గ్రామాలు వదిలి బయట ఉన్నారన్నారు. సైదా సమస్యను జాతీయ ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మైనారిటీలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుల్తాన్‌జరినా మాట్లాడుతూ సైదాపై దాడిని వైసీపీ తరపున ఎన్నికైన నలుగురు మైనారిటీ ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించరన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్‌ మాట్లాడుతూ జగన్‌ అసెంబ్లీలో కూర్చొని సైకోలా, డీజీపీ వైసీపీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్నారన్నారు. సైదాకు ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మన్నాన్‌ షరీఫ్‌, రాష్ట్ర మహిళ అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి, షేక్‌ కరిముల్లా, బాబావలి, నరసరావుపేట పార్లమెంట్‌ లీగల్‌ అధ్యక్షుడు రావెళ్ల లక్ష్మీనారాయణ, బడేబాబు, మాబు, సైదావలి, బాషా, యాడ్స్‌ వలి, మీరవలి, మొహ్మద్‌ రఫీ, ఉమ్మర్‌, ఖాలీల్‌ తదితరులు పాల్గొన్నారు.  

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పరామర్శ

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ, ఆయన బృందం సైదాను గురువారం పరామర్శించింది. ఇప్పటి వరకు ఇటువంటి దాడులు ఉత్తర భారతదేశంలో మాత్రమే చూశామన్నారు. వైసీపీలో ఉన్న ముస్లిం ప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారని, కనీసం మానవతా దృక్పథంతో ఖండించటం కూడా చేతకాదా అని ప్రశ్నించారు. రెడ్డి కార్డు ఉన్న అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులను రాడ్లతో దాడి చేస్తే కేవలం ఐపీసీ 324 సెక్షన్‌ కేసు పెట్టారన్నారు. ఇటువంటి మూకదాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే వైసీపీ నేత శివారెడ్డి, అతడి అనుచరులపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలన్నారు. 

 

Updated Date - 2021-11-26T06:03:09+05:30 IST