Nimmala ramanaidu: మీరు మాట తప్పారని అందరూ తప్పాలనడం సరైంది కాదు

ABN , First Publish Date - 2022-09-15T20:25:14+05:30 IST

ఏపీ అసెంబ్లీ పరిపాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది.

Nimmala ramanaidu: మీరు మాట తప్పారని అందరూ తప్పాలనడం సరైంది కాదు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో పరిపాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala ramanaidu) ప్రసంగిస్తూ... వైసీపీ నాయకులు (YCP Leader), జగన్ (CM Jagan) ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నారు కాబట్టి... ఇక్కడే రాజధాని అని చెప్పారన్నారు. ‘‘మీరు మాట తప్పారు గనుక అన్ని పార్టీలు తప్పాలి అనడం సరైంది కాదు’’ అని అన్నారు. 140 కోట్లు ఉన్న దేశాన్ని ఢిల్లీ నుంచే పాలన చేస్తున్నారని తెలిపారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడే అమరావతి నిర్మాణంతో ముందుకు వెళ్ళామని తెలిపారు.


రామానాయుడు ప్రసంగం జరుగుతున్న సమయంలో మంత్రి బుగ్గన (Buggana rajendranath) జోక్యం చేసుకున్నారు.  రామానాయుడు చెప్పిన విషయాలు చరిత్రకు, వాస్తావాలకు దూరంగా ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీకి సంభందించిన శాసనసభ్యులకు మాత్రమే ఇక్కడ రాజధాని వస్తోందని ఎలా తెలిసిందని ప్రశ్నించారు. టీడీపీ అంటే టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. 20, 30 సంవత్సరాలు అయినా ఇక్కడ అమరావతి నిర్మించలేమని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-15T20:25:14+05:30 IST