
ఏలూరు: ఓటీయస్ పథకం జగనన్న పైసా వసూలు పథకమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఎవరికీ భయపడి డబ్బులు కట్టవద్దని ప్రజలకు తెలిపారు. ఎవరైనా డబ్బులు కడితే, అవి బంగాళాఖాతంలో కలిసినట్లే అని అన్నారు. ఓటీయస్ రిజిస్ట్రేషన్లు చెల్లుబాటుపై అనుమానాలు ఉన్నాయన్నారు. రేపు న్యాయస్థానాలు గానీ, వేరే పార్టీ ప్రభుత్వం గానీ ఈ రిజిస్ట్రేషన్లు చెల్లవు అంటే డబ్బులు కట్టిన వారి పరిస్థితి ఏమిటి అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి