
విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(Velagapudi Ramakrishnababu) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘వంక లేని వాడు డొంక పట్టుకుని ఏడ్చాడు అన్నట్లు ఉంది ఏపీ ప్రభుత్వ వ్యవహారం’’ అంటూ విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టును చూస్తే ఇదే అనిపిస్తుందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు అరికట్టలేక వైసీపీ నేతలు చేస్తున్న లీకేజీలను టీడీపీకి అంటగట్టాలని చూస్తోందన్నారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి