అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది: TDP MLAs

Published: Fri, 25 Mar 2022 11:20:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది: TDP MLAs

అమరావతి: అసెంబ్లీ జగన్ భజన సభలా మారిందని టీడీపీ ఎమ్మెల్యే చిన రాజప్ప విమర్శలు గుప్పించారు. సభలో మాట్లాడకుండా తమ గొంతు నొక్కారన్నారు. కల్తీ సారా, నకీలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. ఇకనుంచి ప్రజా క్షేత్రం లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 


టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ... సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారన్నారు. ప్రతి రోజు తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి గొంతు నొక్కారని మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.