టీటీడీ నిధులను దారి మళ్లిస్తారా?: ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

ABN , First Publish Date - 2020-09-23T16:44:49+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కోట్లాది రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి..

టీటీడీ నిధులను దారి మళ్లిస్తారా?: ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

మచిలీపట్నం(కృష్ణా): తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కోట్లాది రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించేందుకు నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విమర్శించారు. మంగళవారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంకన్నకు భక్తులు సమర్పించే కానుకలు దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కావాలన్నారు. దేవస్థానం బాండ్లను దారి మళ్లించే యోచన రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. అన్యమతస్థులు కొండపైకి వెళ్లేటప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చే సాంప్రదాయాన్ని రద్దు చేసేందుకు యోచించడం అశాస్ర్తీయమన్నారు.


ఎన్నికల ముందు పవిత్ర గంగానదిలో స్నానం చేసి హిందూత్వాన్ని కాపాడతామని చెప్పిన సీఎం ఆ మాటకు కట్టుబడటం లేదన్నారు. పేదలకు ఇళ్లస్థలాల పేరుతో సేకరించే భూముల్లో రూ.3వేల కోట్ల నిధులు స్వాహా చేశారన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్‌ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య బుధవారం మచిలీపట్నం వస్తున్నారని, ఆయన చేపట్టే ఒక రోజు నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2020-09-23T16:44:49+05:30 IST